24+8.2..ఎన్టీఆర్ క్రేజ్ కి దిమ్మతిరిగే హిస్టారికల్ క్రేజ్

0
204

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ జైలవకుశ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి… కాగా సినిమా బిజినెస్ పరంగాను సంచలనాలు సృష్టిస్తూ దూసుకు పోతుంది. కాగా సినిమాని రెండు ఏరియాలలో భారీ రేటు ఆఫర్ ఇచ్చి మరీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నాడు. నైజాం ఏరియాతో పాటు వైజాగ్ ఏరియాని కూడా భారీ ఆఫర్ ఇచ్చి మరీ దక్కించుకున్నాడట దిల్ రాజు.

నైజాం ఏరియాని 24 కోట్లకు, వైజాగ్ ఏరియాని 8.2 కోట్లకి మొత్తంగా 32.2 కోట్లు ఇచ్చి రెండు ఏరియాల రైట్స్ ని దక్కించుకున్నాడట…అది GST టాక్స్ ఇంప్లిమెంట్ తో కలిపి అని అంటున్నారు. అవి లేకుండా అయితే నైజాం లో 21 కోట్లు, వైజాగ్ లో 7.8 కోట్లు అంటున్నారు.

దిల్ రాజు సినిమా పై ఇంత భారీ నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఎన్టీఆర్ నటనేనని చెప్పొచ్చు. ప్రతీ ఆడియన్స్ లో సినిమాను ఒక్కసారి అయినా చూడాలి అనే భావన ఉండటం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాబోతుంది అంటున్నారు. సినిమా సెప్టెంబర్ 21 న భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా, ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here