జై లవకుశ సినిమా పై ఇండస్ట్రీ హిట్ కావాలి అంటే..!ఇక ఎంత కలక్ట్ చేయాలి అంటే

0
2676

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ  ఈ నెల 21న విడుదల అయ్యింది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్ టైం రికార్డ్ ఫర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు.ఎన్టీఆర్ కెరీర్ లో లాస్ట్ ఇయర్ జనతాగ్యారేజ్ టాప్ ప్లేస్ లో బిజినెస్ చేసిన సినిమాగా నిలవగా ఇప్పుడు ఆ రికార్డును ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ మరియు బాబీ ల కాంబినేషన్ లో వస్తున్న జైలవకుశ సినిమా బ్రేక్ చేసింది అని చెప్పొచ్చు. జనతాగ్యారేజ్ 65 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పుడు జైలవకుశ ఏకంగా 85 కోట్ల బిజినెస్ చేసింది.

 

అందులో నైజాంలో 21 కోట్లు, సీడెడ్ లో 12.6 కోట్లు బిజినెస్ చేసింది. టోటల్ ఆంధ్రాలో 31 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 64.6 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఇతర ప్రాంతాల్లో మరో 20.4 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తంగా 85 కోట్ల బిజినెస్ ని అందుకోగా క్లీన్ హిట్ కి 86 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here