పాదయాత్రలో జగన్ కి మరో ఇబ్బంది..! వైసిపి శ్రేణుల్లో ఆందోళన..!

0
463

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో బిజీ బిజీగా గడుపుతున్నారు.జగన్ పాదయాత్రలో మరో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. జగన్ పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది.

పాదయాత్ర ఆరంభ దశలోనే జగన్ కు నడుం నొప్పి సంభవించడంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొని ఉంది. 2వరోజు జగన్ వేంపల్లికి చేరుకున్న నేపథ్యంలో నడుం నొప్పి వస్తోందని అనుచరులకు తెలియజేసారు.

జగన్ అనుచరులు వెంటనే తిరుపతి నుంచి ఫియోజి థెరపిస్టుని రప్పించి ప్రథమ చికిత్స నిర్వహించారు.నడుం నొప్పి తీవ్రతరం కాకుండా బెల్టు ధరించాలని ఫియోజి సూచించారు. దీనితో బెల్టు ధరించిన జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here