బంపర్ ఆఫర్ దక్కించుకున్న నాని..!ఇండస్ట్రీ BIG షాక్..!

0
215

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని.రీసెంట్ గా నిన్ను కోరి హిట్ అందుకున్న నాని ప్రస్తుత రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో mca (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత  వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మరియు ఎక్స్ ప్రెస్ రాజాతో హిట్స్ అందుకున్న మేర్లపాక గాంధీతో కృషార్జున యుద్ధం’ అనే స్క్రిప్ట్ ను ఒకే చేసాడు. వీటితో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్’లో ఓ సినిమాకు కమిట్ అయినట్లు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.   

తాజాగా కళ్యాణ్ రామ్ నానికి ఓ యువ దర్శకుడితో మంచి కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లవ కుశ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే నాని ఒప్పుకుంటే వెంటనే కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకరావాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here