సింహాద్రి విజయానికి ముందు..!జై లవకుశ సినిమాతో ఇప్పుడు..?

0
504

యంగ్ టైగర్ ఎన్టీఆర్,బాబీ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ జై లవకుశ.ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల  కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ రోల్ లో కూడా కనిపిస్తున్నాడు.

కాగా ఆ విలన్ రోల్ ప్రొఫెషన్ పొలిటికల్ లీడర్ అవ్వడంతో ఇదివరకు ఎన్టీఆర్ చేసిన ఓ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ సినిమాతో ఈ సినిమాను కంపేర్ చేస్తున్నారు. సింహాద్రి విజయానికి ముందు ఎన్టీఆర్ నటించిన నాగ అనే సినిమా విడుదల అయ్యింది.

చిన్న ఏజ్ లోనే పూర్తీ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ సినిమాని ఎంచుకోవడంతో ఆ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.దాంతో ఎన్టీఆర్ మళ్ళీ అలాంటి స్టొరీలను ఎంచుకోలేదు.మళ్ళీ ఇప్పుడు రాజకీయనాయకుడిగా కనిపిస్తుండటంతో ఈ సినిమాకు ఆ సినిమాకు కంపారిజన్స్ చేయడం మొదలు పెట్టారు.

కానీ ఇందులో మూడు రోల్స్ చేస్తుండటం ఈ పొలిటికల్ లీడర్ ఒక్క రోల్ మాత్రమె అదీ నెగటివ్ షేడ్స్ ఉండటంతో పెద్దగా ఎఫెక్ట్ చూపే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here