ఇండస్ట్రీ BIG షాక్..!ఎన్టీఆర్ ఏమిటి మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..?

0
2052

యంగ్ టైగర్ ఎన్టీఆర్  జై లవకుశ సినిమా తరువాత ఏకంగా మూడు నెలల పాటు సినిమాల నుంచి లీవ్ తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు 15-20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి.. 100 కోట్ల మార్కెట్.. కోట్లాదిమంది అభిమానులు ఉన్న ఓ స్టార్ హీరో.. నిజానికి తలుచుకుంటే ఈ 3 నెలల టైంలో ఓ మూవీ ఫినిష్ చేసేయచ్చు కూడా. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు లాంగ్ లీవ్ కే ఫిక్స్ అయ్యాడు. జనవరి వరకూ కొత్త సినిమాలు.. ప్రాజెక్టుల జోలికి పోకూడదని భావిస్తున్నాడట ఎన్టీఆర్.

గత మూడు నెలలుగా ఈ హీరో ఫుల్లు బిజీగా గడిపేశాడు. ఒకవైపు జై లవకుశ ను అనుకున్న సమయానికి సిద్ధం చేయడం.. మరోవైపు బిగ్ బాస్ కోసం ప్రిపేర్ కావడం.. ఎన్టీఆర్ పూర్తిగా రెస్ట్ లెస్ నెస్ కి గురి చేశాయి. ఇప్పుడు రియాల్టీ షో అయిపోయింది. మరోవైపు సినిమా రిజల్ట్ కూడా వచ్చేసింది.

దీంతో ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ అయ్యాడు. ఈ రిలాక్సేషన్ ను ఓ 3 నెలల పాటు కంటిన్యూ చేసి.. జనవరి వరకూ వెకేషన్ కు కేటాయిస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వెకేషన్ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్లన్ చేస్తున్నాడు.     

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here