జైలవకుశ సెన్సార్ రివ్యూ…బ్లాక్ బస్టర్ ఆన్ ది వే!!!

0
224

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశ గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే… భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ చేస్తుండగా అందు లో మెయిన్ హైలెట్ అయిన విలన్ రోల్ సినిమా కి మెయిన్ పిల్లర్ గా మారింది అంటూ ఇండస్ట్రీ లో చెప్పు కుంటున్నారు.

కాగా రీసెంట్ గా సెన్సార్ పనులు జరుపుకున్న ఈ సినిమా కి యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వగా సినిమా చూసిన సెన్సార్ వారు ఎన్టీఆర్ ని స్పెషల్ గా మెచ్చుకున్నారట…మూడు పాత్రల్లో మరీ ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన అబ్బుర పరిచే విధంగా ఉందని మెచ్చుకున్నారట.

కథ గురించి ఎక్కడా లీక్ అవ్వక పోయినా సినిమా ఫస్టాఫ్ ఎంత బాగొచ్చిందో సెకెండ్ ఆఫ్ ని అంతే బాగా బాబీ డీల్ చేశాడని…అభిమానులనే కాదు సామన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారట…మరి ఈ మాటలు ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యాక తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here