జై లవకుశ,స్పైడర్,మహానుభావుడు ఈ మూడు సినిమాలు అక్కడ ఫ్లోప్ అంట..!కారణం తెలిస్తే షాకే..!

0
667

దసరా పండగ సందర్భంగా విడుదల అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ,సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్,శర్వానంద్ లేటెస్ట్ మూవీ మహానుభావుడు.ఈ మూడు సినిమాలలో జై లవకుశ సినిమాకి ఫస్ట్ డే వినిపించిన టాక్‌ కి చాలా బాగానే పర్‌ఫార్మ్‌ చేసింది. స్పైడర్‌ అయితే మరీ దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది.మహానుభావుడు హిట్‌ అనిపించుకుంది.

జైలవకుశ, స్పైడర్‌ సినిమాకి ఓపెనింగ్స్‌ ఓ రేంజ్ లో వచ్చాయి.స్పైడర్‌ అయితే మిలియన్‌ డాలర్లకి పైగా ప్రీమియర్స్‌లోనే కలక్ట్‌ అయినా ఆ తర్వాత అంతా కలిపి అర మిలియన్‌ రాలేదు. భారీ రేటుకి రైట్స్‌ తీసుకున్న స్పైడర్‌ ఓవర్సీస్‌ బయ్యర్‌ నిండా మునిగిపోయినట్టే.    

జై లవకుశ బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుందని ఆశించారు కానీ మొదటి వీకెండ్‌ తర్వాత పూర్తిగా నెమ్మదించడంతో 1.7 మార్కుతోనే సరిపెట్టింది. ఈ సినిమాకి కూడా మరో అర మిలియన్‌ వసూలైతే తప్ప ఓవర్సీస్‌ బయ్యర్‌ సేఫ్‌ అవడట. ఇక మహానుభావుడుకి మంచి రివ్యూలు వచ్చినా కానీ రెండు పెద్ద సినిమాల తర్వాత వెంటనే రావడం బాగా ఎఫెక్ట్‌ చేసింది. దీంతో మహానుభావుడు కొన్న వారికి కూడా నష్టాలు తప్పేట్టు లేవు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here