మహానుభావుడు ఫైనల్ రివ్యూ..!హిట్..?ఫ్లోప్..?

0
653

సినిమా : మహానుభావుడు , తారాగణం: శర్వానంద్‌, మెహరీన్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, భద్రం, నల్లవేణు, రామరాజు తదితరులుసినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫి, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌, రచన, దర్శకత్వం: మారుతి 

యంగ్ హీరో శర్వానంద్ ఇప్పటికి రెండుసార్లు పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి విజయాల్ని అందుకున్నాడు.  ఈసారి మహానుభావుడుసినిమా ద్వారా జై లవ కుశ, స్పైడర్వంటి భారీ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగాడు. మారుతితో దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాఎలా ఉందో చూద్దాం.

స్టొరీ :- ఆనంద్ (శర్వానంద్) అతి శుభ్రత అనేది బలహీనత మారిపోయే ఓసీడీ అనే డిజార్టర్ తో బాధపడే కుర్రాడు. కానీ అతడి డిజార్టర్ అవతలి వాళ్లకు ఇబ్బంది కానీ.. అతను మాత్రం దాన్నో క్వాలిఫికేషన్ లాగా భావిస్తుంటాడు. అలాంటి కుర్రాడు.. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న మేఘన (మెహ్రీన్ కౌర్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమించి తన తండ్రికి విషయం చెబుతుంది. ఆయన కూడా వీళ్ల పెళ్లికి సరే అంటాడు. ఐతే ముందు ఆనంద్ బలహీనతను తేలిగ్గానే తీసుకున్న మేఘనకు తర్వాత దాని తీవ్రత అర్థమవుతుంది. దీంతో అతణ్ని అసహ్యించుకుని దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో తన ప్రేమను గెలిపించుకోవడానికి ఆనంద్ ఏం చేశాడన్నదే మిగతా స్టొరీ

ప్లస్ పాయింట్స్ : శర్వానంద్ మరోసారి తానెంతటి విలక్షణ నటుడో రుజువు చేశాడు. ఓసీడీ డిజార్డర్ ఉన్న కుర్రాడిగా అతను జీవించేశాడు. ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్.. మేనరిజమ్స్.. నటనతో శర్వా అదరగొట్టేశాడు. నిజంగానే ఓసీడీ ఉన్న వ్యక్తిలాగా కనిపించాడు శర్వా. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో మరింత మెరుగైంది. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. కృష్ణగాడి వీర ప్రేమగాథతో పోలిస్తే కొంచెం నాజూగ్గా.. మరింత అందంగా తయారైన మెహ్రీన్.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తెరమీద హీరోయిన్ కనిపించినపుడల్లా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. కుర్రాళ్లకు ఈ అమ్మాయి భలేగా నచ్చేస్తుందనడంలో సందేహం లేదు. ఆమె నటన కూడా బాగానే సాగింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువ స్కోర్ చేసేది వెన్నెల కిషోరే. తనదైన కామెడీ టైమింగ్ తో.. హావభావాలతో అలరించాడు కిషోర్. నాజర్ తనకు అలవాటైన తండ్రి పాత్రలో ఓకే అనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

మైనస్ పాయింట్స్ :- సినిమా ఆరంభం నుండే ఎలా ఉంటుందో ఊహించేయవచ్చు. హీరో పాత్ర చేసే పనుల్ని, ప్రతిస్పందించే తీరుని తప్ప ఫస్టాఫ్ దాని తర్వాత సెకండాఫ్ ఎలా నడుస్తుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ స్టొరీ మలుపు తిరుగుతుంది అనే అంశాలన్నీ ప్రేక్షకుడు ముందుగా అనుకున్నట్టే ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కోసం ధైర్యం చేసే సీన్ చాలా సినిమాల్లోలాగే రొటీన్ గానే ఉంది. అక్కడ కాస్తంత కొత్తదనమేమన్నా పాటించి ఉంటే బాగుండేది. అలాగే కథనం క్లైమాక్స్ కు దారితీసే కీలకమైన సన్నివేశం కొంత నాటకీయంగా అనిపించింది.  

సాంకేతికవర్గం: తమన్ చాన్నాళ్ల తర్వాత మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు. అతడి సంగీతం సినిమాకు పెద్ద బలం. పాటలన్నీ బాగున్నాయి. వాటి చిత్రీకరణ.. ప్లేస్మెంట్ కూడా బాగుండటంతో సినిమాకు సాంగ్స్ ఆకర్షణగా మారాయి. తమన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిజార్ షఫి ఛాయాగ్రహణం కూడా బాగుంది.!!!

విజువల్స్ ఆద్యంతం రిచ్ గా… ప్లెజెంట్ గా అనిపిస్తాయి. యువి క్రియేషన్స్ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక బాబు బంగారంతో నిరాశ పరిచిన మారుతి.. ఈసారి మళ్లీ తన మార్కు చూపించాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిపై తనకు మంచి అవగాహన ఉందని అతను మరోసారి రుజువు చేశాడు.

ఫైనల్ ఈ సినిమాకి మీము ఇచ్చే రేటింగ్ :3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here