14 సంవత్సరలు అవుతున్న ఆ రికార్డ్ ని ఎన్టీఆర్ ఇంతవరకు బ్రేక్ చేయలేకపోయ్యాడు

0
963

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వరుసా హిట్ లతో ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ ప్రస్తుతం పైపైకి వెళుతోంది.’జై లవకుశ’ సినిమా విడుదల అయిన 46 రోజులోనే 87కోట్ల పైగా షేర్ కలెక్షన్ సాదించి 90 కోట్ల వైపుకి దూసుకుపోతున్నాడు.జై లవకు యావరేజ్‌ టాక్‌ వచ్చిన ఈ సినిమాకి బాక్సాఫీస్‌ పరంగా అన్నీ ఎన్టీఆరే అయ్యాడు. ఇంతకుముందు జనతా గ్యారేజ్‌తో కూడా ఆకట్టుకున్న ఎన్టీఆర్‌కి టెంపర్‌ నుంచి మంచి టైమ్‌ స్టార్ట్‌ అయింది. అయితే ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్‌కి మళ్లీ అంతటి ఘన విజయం మాత్రం ఇంకా రాలేదు.  

సింహాద్రి మాదిరిగా బాక్సాఫీస్‌ వద్ద విధ్వంసం చేసిన బ్లాక్‌బస్టర్‌ ఎన్టీఆర్‌ నుంచి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. టెంపర్‌ నుంచి జై లవకుశ వరకు ఎన్టీఆర్‌ సూపర్ హిట్ అందుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు.  

ఆ లోటుని త్రివిక్రమ్‌ సినిమా తీరుస్తుందని, ఆ సినిమాతో ఎన్టీఆర్‌కి మళ్లీ సింహాద్రిలాంటి ఘన విజయం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా మార్చిలో మొదలు పెడతానని త్రివిక్రమ్‌ చెప్పడంతో ఎన్టీఆర్‌ అంతవరకు విరామం తీసుకుని కొత్త లుక్‌ మీద వర్క్‌ చేసే పనిలో వుండనున్నాడు.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here