ఎన్టీఆర్ సినిమా పై రాజమౌళి చేసిన వాఖ్యలు వింటే షాక్ అవుతారు

0
774

 ‘బాహుబలి’ తర్వాత s.s.రాజమౌళి ఏ సినిమా చేస్తాడనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. చాలా మంది హీరోలు నిర్మాతల పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ సారి టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. ఐతే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి తన తర్వాతి సినిమా విషయంలో ఏదీ ఫైనలైజ్ కాలేదని తేల్చి చెప్పాడు.ఐతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలన్న ఆసక్తిని మాత్రం ప్రదర్శించాడు రాజమౌళి. 

గతంలో ఎన్నోసార్లు ఎన్టీఆర్ మీద తన ఇష్టాన్ని బయటపెట్టిన రాజమౌళి.. మరోసారి తన తొలి చిత్ర కథానాయకుడి గురించి సానుకూలంగా మాట్లాడాడు. ఎన్టీఆర్ తో మీ తర్వాతి సినిమా ఉంటుందా అని అడిగితే..

ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఇది ఇంతకుముందు కూడా చెప్పానని.. తన తర్వాతి సినిమా ఎన్టీఆర్ తో ఉండొచ్చని.. ఉండకపోవచ్చని రాజమౌళి అన్నాడు. స్టొరీ ఓకే అయ్యాకే ఏదైనా డిసైడ్ చేసుకుంటానని రాజమౌళి తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here