ఎన్టీఆర్ రే దిక్కు అంటున్న డైరెక్టర్..?

0
866

ఇండస్ట్రీలో ఎవరికి ఒక్క పడితే చాలు అందరూ ఆ హిట్ ని క్యాష్ చేసుకోవాలి అనుకునేవాల్లె…ఆలాంటిది వరుసగా మూడు హిట్లు పడితే ఆ హీరోని వదిలిపెడతారా చెప్పండి…ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు వరుస సక్సెస్ ల తరువాత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉండగా ఆ చాన్స్ కోసం చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు క్యూలో ఉన్నారు. వారిలో బ్రహ్మోత్సవంతో ఆల్ టైం డిసాస్టర్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాలా కూడా ఉన్నాడట.

ఈ మధ్యనే ఎన్టీఆర్ కి ఒక లైన్ వినిపించిన శ్రీకాంత్ అడ్డాలా ఎన్టీఆర్ ఒక్క చాన్స్ ఇవ్వకపోతాడా అని వెంటపడుతున్నాడట. ఇప్పుడు కెరీర్ తిరిగి గాడిలో పడిందన్న సంతోషంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడున్న పొజిషన్ లో ఆయనతో సినిమా చేసే సాహసం చేయొద్దని అంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here