ఎన్టీఆర్ ఆఫీస్ నుండి అఫీషియల్ న్యూస్ బయటకి వచ్చింది

0
2122

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవకుశ.రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్  మాట్లాడుతూ జై లవకుశ సినిమాను ఐసియులో చావుబతుకుల మద్య ఉన్న పేషెంట్‌తో, ప్రేక్షకులను డాక్టర్లతో విశ్లేషకులను దారిన పోయే దానయ్యలతో ఎన్టీఆర్‌ పోల్చిన వివాదం ఇప్పటికీ ముగియలేదు. ఆయన వ్యాఖ్యలు విశ్లేషకులను తీవ్రంగా హర్ట్‌ చేశాయి.

దాంతో ఈ మద్య ఎన్టీఆర్‌ ఆ పోలిక తెచ్చిన తర్వాత తమ ఇగోని ఎన్టీఆర్‌ హర్ట్‌ చేయడంపై విశ్లేషకులు తీవ్ర ఆగ్రహంగా ఉండటంతో రోజురోజుకి ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా ఓ కథనమైనా వస్తోంది.దాంతో ఎన్టీఆర్‌ కాస్త తగ్గి,  

తాను అందరనీ అనలేదని, కొందరిని మాత్రమే అన్నానని, కాబట్టి ఇకనైనా ఎన్టీఆర్‌ గురించి నెగటివ్‌ ఆర్టికల్స్‌ ఇవ్వడం ఆపాలని, రెండు మూడు రోజుల్లో పత్రికా ముఖంగానే ఎన్టీఆర్‌ విశ్లేషకులకు క్షమాపణ చెబుతాడని ఎన్టీఆర్‌  ఆఫీస్ నుండి వార్తలు బయటకి వస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here