ఒక్క ఛాన్స్ అంటూ వెంటపడుతున్న ఒకపట్టి టాప్ డైరెక్టర్

0
458

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోలో ముందుగా నిలిచే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. సెట్స్ లో ఒక సినిమా ఉన్నా చేతిలో అరడజను సినిమాల స్క్రిప్టులు ఎప్పుడు పట్టుకుని తిరిగే ఎన్టీఆర్ కి కథలు చెప్పే దర్శకులు రోజు పదుల్లో ఉంటారనేది ఇన్ సైడ్ టాక్. అందులో బెస్ట్ స్టోరీలను ఎంచుకుంటాడు ఎన్టీఆర్.అప్పట్లో ఇది దెబ్బకొట్టినా టెంపర్-నాన్నకుప్రేమతో.

జనతాగ్యారేజ్,జై లవకుశ  సినిమాల నుండి ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ మళ్ళీ పాతరోజులకు వెళ్లకూడదని అనుకుంటున్నాడు. అందుకోసమే మంచి స్క్రిప్టులను మాత్రమే ఎన్నుకుంటున్న ఎన్టీఆర్ కి ఈ మధ్య ఓ ఫ్లాఫ్ దర్శకుడు స్టొరీ ఉంది చేస్తారా అంటూ వెంటపడుతున్నాడట.

ఆ దర్శకుడు మరెవరో కాదు, ఒకప్పుడు లాహిరిలాహిరిలారిలో, సీతారామరాజు, సీతయ్య, దేవదాసు లాంటి భారీ హిట్స్ కొట్టిన YVS.చౌదరి ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో సినిమా పడితే బౌన్స్ బ్యాక్ అవుతామని ఆశపడుతున్నా ఎన్టీఆర్ మాత్రం YVS  కి ప్రస్తుతం రెడ్ కార్పెట్ పరిచే ఆలోచనలో లేనట్లు చెప్పేశాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here