ఎన్టీఆర్ రాకతో బాలీవుడ్ లో అలజడి రేగడం ఖాయం

0
1151

ఒక్కో ఏరియా లో ఒక్కో ఘటికుడు ఉంటాడు.వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వందమంది ముక్కి మూలిగినా  కానీ చెయ్యలేని పనిని అవలీలగా చేసేస్తాడు.అలాంటి ఘటికుల్లో బాలీవుడ్ ఫిలిం మేకర్  కరణ్ జోహార్ ఒకడు. అయన కనుక ఒక సినిమాను చేస్తే ఆటోమేటిక్ గా ఆ సినిమాకు క్రేజ్ వస్తుంది.బాలీవుడ్ లో బాహుబలి- 1, బాహుబలి – 2 లాంటి భారీ విజయం సాధించడానికి ఫౌండేషన్ కరణ్ జోహార్ అనడం లో ఏమాత్రం సందేహం లేదు.అయన చేతిలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పడబోతున్నాడట.

ఇప్పుడు జై లవకుశ సినిమా హిందీ వెర్షన్ ను విడుదల చేయడానికి ఒప్పుకున్నాడట.ఎక్కడ ఈ సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది అనే అంచనాకు వస్తాడట. దాన్ని బట్టి హిందీ వెర్షన్ విడుదల ప్లాన్ చేస్తాడట. 

ఇప్పటికే ఎన్టీఆర్ కు నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా  ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇప్పుడు కరణ్ జోహార్ లాంటివాడు కనుక హిందీ వెర్షన్ విడుదల చేస్తే బాలీవుడ్ లో మనోడు సత్తా చాటినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here