టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలే కి టాప్ 2 ప్లేస్..!దుమ్ములేపిన TRP రేటింగ్..!

0
694

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన తెలుగు బిగ్ బాస్ సీజ‌న్‌-1 గ్రాండ్ స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో ఈ షోకు పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌క‌పోయినా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న మాట‌ల మాయాజాలంతో షోను ర‌క్తిక‌ట్టించాడు. ఎన్టీఆర్ హోస్టింగ్ కు నాగార్జున వంటి సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. ఈ షోకు ఇంద ఆద‌ర‌ణ రావ‌డానికి ఎన్టీఆర్ కార‌ణ‌మంటూ ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.రీసెంట్ బిగ్ బాస్ సీజన్ 1ని కంప్లేట్ చేసుకుంది.    

ఎన్టీఆర్ తొలిసారిగా హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో ఫస్ట్ షో టెలికాస్ట్ అయితే టెలివిజన్ చరిత్ర లోనే తొలిసారిగా 16.20 TRP రేటింగ్ తెచ్చి స్టార్ మా టీవీ ని నెంబర్ 1 ప్లేస్ ని దక్కేలా చేసాడు ఎన్టీఆర్. రీసెంట్ గా బిగ్ బాస్ ఫైనల్ షో తో మరోసారి రికార్డ్ క్రియేట్ చేసాడు ఎన్టీఆర్.

బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలే  టెలికాస్ట్ చేస్తే మరోసారి హైయెస్ట్ TRP రేటింగ్ ని సాధించాడు.రీసెంట్ బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలే TRP రేటింగ్ ని అనౌన్స్ చేసారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలే షో కి 14.13 TRP రేటింగ్ వచ్చింది అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.టెలివిజన్ చరిత్రలో హైయెస్ట్ TRP రేటింగ్ సాధించిన షో గా బిగ్ బాస్ షో హిస్టరీ క్రియేట్ చేసింది.అలాగే టాప్ 1,2 ప్లేస్ లో బిగ్ బాస్ షో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here