అఫీషియల్ న్యూస్..! వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా..!

0
3094

వరుసగా సినిమాలు ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి సంభందించిన ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.జై లవకుశ హిట్ కావడంతో  ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఎన్టీఆర్ వెంట పడటం మానడం లేదు.

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న గట్టి వార్తల్లో ఎన్టీఆర్ తో బృందావనం లాంటి హిట్  ఇచ్చిన వంశీ పైడిపల్లి ఈ మధ్యనే ఎన్టీఆర్ ని కలిసి ఓ స్టోరీ వినిపించాడని అంటున్నారు. కానీ ఆ స్టోరీ ఒరిజినల్ కాదు బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా.

ఆ సినిమానే అగ్నీపత్, 2012 లో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని కొందరు హీరోలు అనుకున్నా సెట్ అవ్వలేదు. కానీ ఎన్టీఆర్ తో ఈ సినిమాను చేయాలని వంశీ పైడిపల్లి అనుకుంటున్నాడాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here